AP Political News: 'చిరంజీవిని జగన్‌ సోదరుడిగా భావించాడు'

by GSrikanth |   ( Updated:2022-08-22 08:58:22.0  )
AP Political News: చిరంజీవిని జగన్‌ సోదరుడిగా భావించాడు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు. అస్తమానం కులాల ప్రస్తావన తీసుకొచ్చే పవన్ కల్యాణ్ ఆత్మాభిమానం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చిరంజీవిని సోదరుడిగా భావించి ఇండస్ట్రీ సమస్యలపై జగన్ మాట్లాడారని అన్నారు. అసలు ఆత్మభిమానం అంటే ఏంటో పవన్ కల్యాణ్‌కు తెలుసా? అని కొడాలి నాని ప్రశ్నించారు. పకోడి స్వామి అయిన పవన్ కల్యాణ్‌కు చెకోడీ భక్తుడైన చంద్రబాబు ప్యాకేజీల నైవేద్యం సమర్పిస్తున్నారని అన్నారు. ఉన్న పుత్రుడితో ప్రయోజనం లేదని, చంద్రబాబు దత్తపుత్రుడి భజన చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు అండ్ కో, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసినా డిపాజిట్లు రావు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

అమిత్ షా, ఎన్టీఆర్‌ల కలయిక సంచలనం కాబోతుంది: బీజేపీ

Advertisement

Next Story

Most Viewed