- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా బీజేపీ బిగ్ స్కెచ్.. అదును చూసి అమలు!
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాలు సెంగోల్ చుట్టూ తిరుగుతున్నాయి. బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా నిలిచిన సెంగోల్‌ను కొత్త పార్లమెంట్ భవనంలో వారసత్వంగా ఉంచబోతున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాలన్ని దీని చుట్టే తిరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై అమిత్ షా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని వరుస ట్వీట్ల ద్వారా ప్రశ్నించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం నెహ్రుకు సెంగోల్ ను అందించిందని అయితే దానిని నెహ్రు వాకింగ్ స్టిక్ గా పేర్కొంటూ మ్యూజియంలో ఉంచబడిందని షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను బోగస్ అంటోందని దీన్ని బట్టే వారి ప్రవర్తన ఎలాంటిదో ఆలోచన చేయాలన్నారు.
అదునుచూసి దెబ్బ?:
ఓ వైపు కొత్త పార్లమెంట్ ఎవరు ప్రారంభించాలనే విషయంలో విపక్షాలు ఏకమవుతుంటే అనూహ్యంగా సెంగోల్ అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. నిజానికి అమిత్ షా ప్రకటించే వరకు సెంగోల్ అనేది ఒకటి ఉందని, దాన్ని అధికార మార్పిడికి చిహ్నంగా దాన్ని బ్రిటిషర్ల నెహ్రుకు ఇచ్చారనే విషయం చాలా మందికి తెలియదు. నిన్నటి వరకు అలహాబాద్ మ్యూజియంలో ఉన్న ఈ రాజదండం పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఓ అంశం రాజకీయ కాంగ్రెస్ కు షాకిచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. మ్యూజియంలో ఈ సెంగోల్ ను నెహ్రు కు సంబందించిన బంగారు వాకింగ్ స్టిక్ గా పేర్కొన్నారని బీజేపీ ఫైర్ అవుతోంది.
దశాబ్దాలుగా ఇలానే తప్పుగా పేర్కొన్నారని కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది. అయితే ఈ సెంగోల్ కు సంబంధించి విషయం బీజేపీకి ముందే తెలిసినా పక్కా వ్యూహం ప్రకారం అదును కోసం ఎదురు చూసిందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కర్ణాటక ఫలితాలు, విపక్షాల ఐక్యతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్లమెంట్ భవనం ప్రారంభించే విషయంలో విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెంగోల్ చరిత్రను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం దుమారం రేపుతోంది.
Why does the Congress party hate Indian traditions and culture so much? A sacred Sengol was given to Pandit Nehru by a holy Saivite Mutt from Tamil Nadu to symbolize India’s freedom but it was banished to a museum as a ‘walking stick’.
— Amit Shah (@AmitShah) May 26, 2023