సీపీపై పరువు నష్టం దావాకు సిద్ధమవుతున్న బండి సంజయ్..!

by Javid Pasha |   ( Updated:2023-04-10 11:17:39.0  )
సీపీపై పరువు నష్టం దావాకు సిద్ధమవుతున్న బండి సంజయ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ సీపీ రంగనాథ్ పై పరువు నష్టం దావా వేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి తొత్తుగా మారి తనపై నిరాధారమైన ఆరోపణలతో విచారణకు రావాలని నోటీసులు పంపించడంపై సంజయ్ ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వద్ద మార్కులు కొట్టేయాలని ఇలా ప్రతిపక్ష పార్టీలపై కేసులు వేయడంపై కమలనాథులు గుర్రుగా ఉన్నారు. కాగా తనను మరోసారి విచారణకు హాజరుకావాలని వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బండి ఇప్పటికే రిప్లై ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలతో తన పొలిటికల్ కెరియర్ ను బ్యాడ్ గా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో వరంగల్ సీపీపై పరువు నష్టం దావా వేయాలనే నిర్ణయాన్ని సంజయ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆదివారం లీగల్ టీంతో భేటీ అయిన సంజయ్.. తాజాగా మరోసారి సోమవారం సైతం ఆ బృందంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వరంగల్ సీపీ రంగనాథ్ పై పరువునష్టం దావా వేసేందుకు ఏర్పాట్లు చేయాలని బండి వారికి సూచించడంతో ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్వహారంలో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ సైతం బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. పరువు నష్టం దావాతో పాటు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకు సైతం ఈ అంశాన్ని బండి సంజయ్ తీసుకెళ్లే యోచనలో ఉన్నారని బీజేపీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: కమలాపూర్ పోలీసులకు బండి సంజయ్ స్ట్రాంగ్ రిప్లై

Advertisement

Next Story