- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ అరెస్ట్ హేయమైన చర్య.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఓ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Advertisement
Next Story