- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడికత్తి తరహాలో అవినాష్ రెడ్డి డ్రామా.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా బీజేపీ ఆపుతోందనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకుంటున్న అజ్ఞాత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. గొడ్డలి వేటును గుండెపోటుగా మార్చిన వారిని అరెస్ట్ కాకుండా ఆపడం ఎవరి తరం కాదని సత్యకుమార్ చెప్పుకొచ్చారు. అరెస్ట్ ఆలస్యం కావడం సీబీఐ వ్యూహాత్మక వ్యవహారమని, దానికి కేంద్రానికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ‘కోడికత్తి’ తరహాలో ఎంపీ అవినాష్‌రెడ్డి డ్రామా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.
తిరుపతిలో బుధవారం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ నాలుగేళ్ళుగా నమ్మకద్రోహంతో నయవంచక పాలన అందించారని మండిపడ్డారు. రాజధాని అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, బిందు సేద్యం వంటి అంశాలలో ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు పంచ భూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో పొత్తులు అంశంపై ఎన్నికలు రెండు నెలల ముందు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి కలిగిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటకు బీజేపీ సైతం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు.