- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీపై మరో కేసు.. ఈసారి ఏం జరుగుతుందో?
దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని తొలగించింది. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ‘మోడీ పేరుతో ఉన్నోళ్లంతా దొంగలే’ అంటూ కామెంట్ చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బీహార్ కు చెందిన బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు విచారణ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 12న విచారణకు రావాలంటూ పాట్నా కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఆ రోజు రాహుల్ స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నట్లు అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆది దేవీ తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుశీల్ కుమార్ మోడీ, బంకీపూర్ ఎమ్మెల్యే నితిన్ నవీన్, డిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా, బీజేపీ యువ మోర్చా నేత మనీశ్ కుమార్ స్టేట్ మెంట్లను కోర్టు రికార్డు చేసింది. కాగా ఏప్రిల్ 12న రాహుల్ గాంధీ పాట్నా కోర్టుకు హాజరవుతారా లేక మరో గడువు కోరుతారా అనే విషయం తెలియరాలేదు.