టెన్షన్.. టెన్షన్.. కాంగ్రెస్ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

by Shyam |
congress-flag
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. ధాన్యం కొనుగోలుపై అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తే.. ఇటు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ సర్కార్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేపట్టబోయే రైతు నిరసన ర్యాలీ కాసేపట్లో ప్రారభం కానుంది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చూస్తూ నిరసన చేస్తోంది. పబ్లిక్ గార్డన్స్ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వ్యవసాయ కమిషనర్‌ని కలసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేయనున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు చేపట్టబోయే నిరసన ర్యాలీకి పోలీసులు 50 మందికి మాత్రమే అనుమతినివ్వడంతో పోలీసులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

Advertisement

Next Story