కోడిపందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

by Sridhar Babu |   ( Updated:2021-11-05 04:07:38.0  )
కోడిపందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై గురువారం హెడ్ కానిస్టేబుల్ పుల్లారావు సమక్షంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు ద్విచక్ర వాహనాలు, మూడు కోడి పుంజులు 3,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను, నగదును అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కానిస్టేబుల్ తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్ రామారావు, రాము, సర్వేష్, డ్రైవర్ సురేందర్ పాల్గొన్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story