ఎండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నా.. : ఎస్పీ శశిధర్ రాజు

by Aamani |
ఎండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నా.. : ఎస్పీ శశిధర్ రాజు
X

దిశ, ఆదిలాబాద్: పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతరాయంగా పోలీస్ సిబ్బంది కష్టపడడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు పోలీసు సిబ్బంది ఎండవేడిమిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు విటమిన్ -సి లభించే ఆహార పదార్థాలు, పండ్లు అధికంగా తీసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలో ఆహారంతోపాటు తగిన విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో వసంతరావు, నిర్మల్ ఏరియా ఆసుపత్రి సూపరిం టెండెంట్ దేవేందర్ రెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏవో వెంకటశేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, నిర్మల్ పట్టణ, సొన్ సిఐలు జాన్ దివాకర్, జీవన్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story