అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

by Shyam |   ( Updated:2021-01-16 07:20:56.0  )
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు చెప్పారు. వారి దగ్గర నుంచి రూ.35 లక్షలు, 6గ్రా బంగారం, కేజీ వెండి, 23 బైకులు, 3 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ వాజిద్ ఆధ్వర్యంలో ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు వివరించారు. జగదీశ్ మార్కెట్ గుడిలో జరిగిన దొంగతనంతో క్లూ దొరికిందని తెలిపారు. 6 నెలల్లో 26 దొంగతనాలకు ముఠా పాల్పడిందన్నారు.

Advertisement

Next Story