తాను పనిచేసే చోటే.. ఉరివేసుకున్న పోలీస్

by Sumithra |
తాను పనిచేసే చోటే.. ఉరివేసుకున్న పోలీస్
X

దిశ, ఏపీ బ్యూరో: కడప డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. విధుల్లో ఉన్న ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్.. తాను పనిచేస్తున్న ప్రాంతంలోనే ప్రాణాలొదిలారు. వివరాల్లోకి వెళ్తే కడప డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో విజయ్ కుమార్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రూమ్‌లో ఎవరూ లేని సమయంలో విజయ్ కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కంట్రోల్ రూమ్‌కి తోటి ఉద్యోగులు వచ్చేసరికి విజయ్ కుమార్ విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. తమతో ఎంతో సంతోషంగా ఉండే విజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ కలచివేసింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కడప జీజీహెచ్‌కు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed