అఖిలప్రియ భర్త, తమ్ముడు ఎక్కడ..?

by srinivas |   ( Updated:2021-02-15 10:28:16.0  )
Akhila Priya
X

దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్‌పల్లిలో సీఎం కేసీఆర్ బంధువులుగా భావిస్తున్న ప్రవీణ్, నవీన్, సునీల్‌ను జనవరి 5వ తేదీ రాత్రి సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడం, అదేరోజు రాత్రి వదిలేయడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. హఫీజ్‌పేట ల్యాండ్ సెటిల్మెంట్ నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్​ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సహా మొత్తం 28 మంది ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు అఖిల ప్రియ సహా మొత్తం 19 మందిని మాత్రమే అరెస్ట్​చేశారు. కిడ్నాప్​జరిగి 40 రోజులు గడిచినా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగ్ విఖ్యాత్ రెడ్డి సహా మరో 9 మందిని మాత్రం ఇంకా అరెస్ట్​ చేయకపోవడం గమనార్హం. కాగా, కేసులో ఏ1 నిందితురాలు అఖిల ప్రియ కండిషన్​బెయిల్​పొంది ప్రతి సోమవారం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో సంతకం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోమవారం పీఎస్‌కు వచ్చిన అఖిలప్రియ మాట్లాడుతూ.. విచారణకు సహకరిస్తామని, బెయిల్‌పై విడుదలైన తర్వాత ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని తెలిపారు.

Advertisement

Next Story