"డబుల్" పేరిట ఇసుక దోపిడీ..

by Aamani |
డబుల్ పేరిట ఇసుక దోపిడీ..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట ఇసుక పంపిణీ అనుమతులు పొంది.. ఇతరులకు సరఫరా చేస్తూ అధికార పార్టీ నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో సోమవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. దీన్ని విచారించగా.. అన్నారం నుంచి నిర్మల్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలించాలి.

కానీ… సంబంధిత ప్రాంతానికి కాకుండా నిర్మల్ దాటి భైంసా వైపు వెళుతోంది. అనుమానంతో పోలీసులు పత్రాలను తనిఖీ చేయగా అధికార పార్టీ నాయకుడి ఇసుక దందా గుట్టు రట్టయింది. పోలీసులు పట్టుకున్న లారీని మైనింగ్ శాఖకు అప్పగించారు. నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు సదరు నాయకుడు 150 ట్రిప్ ల ఇసుక రవాణాకు అనుమతి పొందినట్లు సమాచారం. ఇప్పటివరకు కేవలం 20 నుంచి 30 మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కి పంపించి, మిగతా లారీలను బయట మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు, నిర్మాణాల పేరుతో ఇసుక అనుమతులు పొంది.. పెద్ద ఎత్తున ఇసుక దందా సాగిస్తున్నారు.

Advertisement

Next Story