బిగ్ బ్రేకింగ్.. రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత..

by Anukaran |   ( Updated:2021-10-02 04:01:47.0  )
Revanth-reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ నేపథ్యంలో ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్, పోలీసులు వందల సంఖ్యలో రేవంత్ రెడ్డి ఇంటి ముందు మోహరించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దిల్‌సుఖ్‌నగర్‌లో విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలీ ప్రారంభం కానుంది.

ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇప్పటికే రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్.. ర్యాలీకి అనుమతి లేదంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో రేవంత్‌ను అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్ద మోహరించారు.

Advertisement

Next Story