భారీ చోరీ.. వారం రోజుల్లో ఛేదించిన పోలీసులు

by Sumithra |   ( Updated:2020-04-27 09:34:54.0  )
భారీ చోరీ.. వారం రోజుల్లో ఛేదించిన పోలీసులు
X

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ మండ‌లం కేటీపీఎస్‌లో గ‌తవారం జ‌రిగిన భారీ దొంగ‌త‌నాన్ని పోలీసులు ఛేదించారు. రూ. 45 ల‌క్ష‌ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన‌ట్లు డీఎస్పీ కెఆర్‌కె ప్ర‌సాద్‌, సీఐ న‌వీన్ తెలిపారు. ఇంటి దొంగ‌ల సాయంతోనే చోరీ జరిగిందని తెలిపారు. ఇద్దరు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, బెల్ మాజీ ఉద్యోగితోపాటు మ‌రో న‌లుగురిని అరెస్టు చేసిన‌ట్లు డీఎస్పీ చెప్పారు.

tag: police chases, thief case, bhadradri kothagudem

Advertisement

Next Story