ఫార్మా కంపెనీల తీరుపై నిరసన 

by  |   ( Updated:2020-03-26 00:48:46.0  )
ఫార్మా కంపెనీల తీరుపై నిరసన 
X

దిశ, మహబూబ్ నగర్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసి, ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటుంటే.. కొందరు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా వేల సంఖ్యలో పని చేస్తున్న ఫార్మా కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలకు బేఖాతరు చేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ ఫార్మా కంపెనీల్లోకి నిత్యం వేలాది మంది ఉద్యోగస్తులు వెళ్తుంటారు. దీంతో పోలెపల్లి గ్రామస్తులు తమను కరోనా బారి నుంచి రక్షించాలంటూ గురువారం ఉదయం నిరసనకు దిగారు. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎక్కడెక్కడో తిరిగి తమ గ్రామం నుంచే వెళ్తుంటారని, దీంతో తమకు కరోనా సోకే ప్రమాదముందని వాపోతున్నారు. ఉద్యోగస్తులను అడ్డుకుని వెంటనే ఫార్మా కంపెనీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడున్న కొన్ని పరిశ్రమల్లో అంతగా అత్యవసరం లేని మందులనూ ఉత్పత్తి చేస్తున్నారని, కాబట్టి ఉత్పత్తి నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: polepally villagers, protest, pharma companies, jadcherla,

Advertisement

Next Story

Most Viewed