- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా ఎమ్మెల్యే పుత్రుడు పోదెం మధు జన్మదిన వేడుకలు..
దిశ, మణుగూరు : భద్రాచలం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోదెం వీరయ్య పుత్రుడు, యువ కెరటం పోదెం మధు చంద్ర పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ కో- కన్వీనర్ గురిజాల గోపి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్స్ పంచారు.
అనంతరం కో- కన్వీనర్ గురిజాల గోపి విలేకరులతో మాట్లడుతూ.. రాబోయే రోజుల్లో తండ్రికి మించిన నాయకుడు అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ ఎమ్మెల్యే పోదెం వీరయ్యను ఎంత అభిమానించారో అలాగే యువ కెరటం పోదెం మధు చంద్రను అంతే అభిమానించి, ఆదరిస్తారని అన్నారు. ప్రజలందరి మన్నలను పొందిన పోదెం వీరయ్య ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీని విడలేదని తెలిపారు.
అలాగే తన పుత్రుడు పోదెం మధు చంద్ర కూడా తన తండ్రి బాటలో నడుస్తూ ప్రజలందరి మన్నలను పొందుతూ, కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను వీడరని అన్నారు. మధు చంద్ర ఎంతో విద్యావంతుడు, మృధుస్వభావి అని ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మధు చంద్ర పుట్టినరోజు సందర్భంగా మండలంలోని కొన్ని గ్రామాలలో వృద్ధులకు పాలు, పండ్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పిరానాకి నవీన్, మండల ఉపాధ్యక్షులు ముక్కెర లక్షణ్, కార్యదర్శి గొల్ల సాంబశివరావు, జాయింట్ సెక్రటరీ పాల్వంచ రాములు, కోడేం సాంబశివరావు, ఎండీ. షరీఫ్, యువజన నాయకులు వేణు, పాషా, కిషన్ తదితరులు పాల్గొన్నారు.