కుమ్రంభీం డీఎంహెచ్‌వో‌కు పీఎంవో ఫోన్

by Aamani |   ( Updated:2020-04-27 13:14:06.0  )

దిశ, ఆదిలాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారికి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. సోమవారం సాయంత్రం పీఎంఓ నుంచి ఫోన్ చేసి జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ బాలుతో పీఎంవో కార్యాలయం సిబ్బంది మాట్లాడి జిల్లాలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలవుతున్న తీరుపై ఆరా తీసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని జిల్లా వైద్యాధికారి ఇచ్చిన సమాచారం మేరకు పీఎంవో సంతృప్తి వ్యక్తం చేసినట్టు అధికారులు వివరించారు.

tags: pmo call to health officer, komaram bheem dist, corona situation, dmho balu

Advertisement

Next Story

Most Viewed