FAO‌లో భారత్ పాత్ర కీలకం : మోడీ

by Anukaran |
FAO‌లో భారత్ పాత్ర కీలకం : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌ (FAO)లో భారత్ పాత్ర చారిత్రాత్మకం అని ప్రధాని మోడీ అన్నారు. ఈ సంవత్సరం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కడం గొప్ప విషయమని పీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తి, సరఫరాలో ఇండియా పాత్ర, భాగస్వామ్యం చారిత్రాత్మకమైందని ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్న వారికి మోడీ అభినందనలు తెలిపారు. పోషకాహార సమస్యను అధిగమించేందుకు భారత్ 17 రకాల కొత్త వంగడాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed