అన్నదాత ఆదాయం పెరుగుతుంది: నరేంద్ర మోడీ

by Shamantha N |
అన్నదాత ఆదాయం పెరుగుతుంది: నరేంద్ర మోడీ
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశ గ్రామాలు, రైతులు కేంద్రకంగా ఈ బడ్జెట్‌ ఉన్నదని అభివర్ణించారు. ‘రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగు రంగాన్ని బలోపేతం చేయడంపైనే బడ్జెట్ 2021 ఫోకస్ ఉన్నది. గ్రామాలు, అన్నదాతల ప్రయోజనాలే చుట్టే బడ్జెట్ రూపొందించారు. ఇందులో అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ ద్వారా వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేసే ప్రతిపాదనలున్నాయి. ఎంఎస్ఎంఈలకు కేటాయింపులు రెట్టింపు చేసి వాటి వృద్ధితోపాటు ఉపాధి అవకాశాలను పెంచే నిర్ణయాలూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న నేటి బడ్జెట్ సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించడంతోపాటు భారత స్వయంసమృద్ధ సామర్థ్యానికి దోహదపడుతుంది. అసాధారణ సంక్షోభ సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ భారత ఆత్మ గౌరవానికి దన్నుగా నిలుస్తుంది. మదుపరులతోపాటు పరిశ్రమ, మౌలికవసతుల రంగాల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది’ అని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed