- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
WTC ఫైనల్‌కు వరుణుడి అడ్డంకి.. తొలిరోజు ఆట రద్దు
దిశ, స్పోర్ట్స్: రెండేళ్ల నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఎవరవుతారా అని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ఇండియా, న్యూజీలాండ్ అభిమానులు స్టేడియంలో, టీవీల ముందు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు కన్నార్పకుండా ఉన్నారు. న్యూజీలాండ్, ఇండియా క్రికెటర్లు కూడా డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎప్పుడు మైదానంలో అడుగుపెడదామా అని ఆసక్తిగా కూర్చుకున్నారు. కానీ అందరి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తెల్లవారక ముందు నుంచే ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం దెబ్బకు మూడు సెషన్లు తుడిచిపెట్టుకొని పోయాయి. ఒక బంతి కాదు కదా కనీసం టాస్ కూడా వేయకుండానే ఆట తొలి రోజు రద్దైంది.
ఐసీసీ అరంగేట్రం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడింయలో శుక్రవారం ప్రారంభం కావల్సి ఉండగా వర్షం కారణంగా తొలి రోజు రద్దైంది. ఇండియా, న్యూజీలాండ్ జట్లు టెస్టు చాంపియన్‌షిప్ కోసం పోటీ పడాల్సి ఉండగా వరుణుడు ఆటకు ఆటంకం కలిగించాడు. సౌతాంప్టన్‌లో ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యమైంది. అంపైర్లు పలు మార్లు మైదానాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వర్షం తగ్గినట్లే అనిపించినా.. తిరిగి పుంజుకున్నది. దీంతో తొలి సెషన్ రద్దైనట్లు ప్రకటించారు. కనీసం మిగిలిన రెండు సెషన్లు అయినా జరుగుతాయని అభిమానులు గ్రౌండ్‌లో వేచి చూశారు. వర్షం తగ్గగానే గ్రౌండ్ సిబ్బంది ఔట్ ఫీల్డ్ ఆరబెట్టటానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పడుతూ ఆగుతూ ఉన్న వర్షం కారణంగా వారి పనికి ఆటంకం ఏర్పడింది. చివరకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయినా ఐదు రోజుల సమయం :
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం లేదా ఇతర కారణాల వల్ల సమయం కోల్పోతే దాన్ని కవర్ చేయడానికి ఒక రోజు రిజర్వ్ డేగా నిర్ణయించారు. ఇప్పుడు తొలి రోజు ఆట కోల్పోవడంతో జూన్ 23వ తేదీని కూడా వాడుకునే అవకాశం ఉన్నది. కాగా, రిజర్వ్ డేని వాడుకునేది లేనిది ఐదవ రోజు చివరి సెషన్‌లో రిఫరీ నిర్ణయిస్తారు. అయితే మిగిలిన నాలుగు రోజుల్లో కూడా సౌతాంప్టన్‌లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజులు కూడా ఆడ సాధ్య పడుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఆటకు ఆటంకం కలిగితే మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ నిపుణులు అంటున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ‘గొప్పదైన టెస్ట్ మ్యాచ్’ గా అభివర్ణించిన డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఒక్క బంతి కూడా పడక పోవడం క్రికెటర్లతో పాటు ఇరు జట్ల అభిమానులను కూడా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది.
ఐసీసీఐ ఆగ్రహం..
కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా ఇంగ్లాండ్‌లోని క్రికెట్ స్టేడియంలలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. గత ఏడాది లాక్‌డౌన్ తర్వాత పాకిస్తాన్, వెస్టిండీస్ సిరీస్‌లు జరిగినా అవన్నీ ఖాళీ స్డేడియంలలోనే నిర్వహించారు. ఏడాదిన్నర తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో భారీ ధరలకు టికెట్లు కొనుగోలు చేశారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నా అభిమానులు గొడుగులు వేసుకొని స్టేడియంకు వచ్చారు. మరోవైపు ఇండియాలో క్రికెట్ అభిమానులు టీవీల ముందు అతుక్కొని పోయారు. కనీసం టాస్ కూడా పడకపోవడంతో ఐసీసీపై మండిపడుతున్నారు. ఇంగ్లాండ్‌లో మూడో వారం నుంచి వర్షాలు పడుతాయని తెలిసి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ డేట్ ఫిక్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టు చరిత్రలో తొలి సారిగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను నిర్వహించడంలో ఐసీసీ పూర్తిగా విఫలమైందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు. మీమ్స్, వీడియోలతో ట్విటర్ట్, ఫేస్‌బుక్‌లలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రెండో రోజు ఆట ఏం జరుగుతుందో చూడాలి.