- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ప్లాస్టిక్ కిరీటం విలువ మీకు తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: అభిమానం ముందు కోట్లు కూడా చిన్నబోతాయి. తమ అభిమాన స్టార్లు, పొలిటీషియన్స్, సింగర్స్, ర్యాపర్స్, రైటర్స్ ఇలా ఎవరైనా సరే..వారికి సంబంధించిన అరుదైన వస్తువులను వేలం వేస్తే కోట్లు కుమ్మరించి మరీ సొంతం చేసుకుంటారు. ఇటీవలే షేక్స్‌పియర్ తొలి నాటకానికి సంబంధించిన పుస్తకం రూ.73కోట్లు పలికింది. జాతిపిత మహాత్మాగాంధీ కళ్లజోడు రెండున్నర కోట్లకు అమ్ముడుపోయింది. ఈ క్రమంలో అమెరికన్ ర్యాప్ గాయకుడు క్రిస్టఫర్ వాలెస్ ధరించిన ప్లాస్టిక్ కిరీటం రూ.45 లక్షలకు వేలంలో ఓ అభిమాని దక్కించుకున్నాడు. ఓ ప్లాస్టిక్ వస్తువుకు అంత డిమాండ్ పలకడం ప్రపంచంలో తొలిసారి అని గిన్నిస్ నిర్వాహకులు తెలిపారు.
క్రిస్టోఫర్ జార్జ్ లాటోర్ వాలస్ అంటే గుర్తుపట్టకపోవచ్చు. కానీ, ద నోటరియస్ బిగ్, బిగ్గీ స్మాల్స్, బిగ్గీ అంటే ఆయన ర్యాప్స్ ఇట్టే గుర్తుకువస్తాయి. అమెరికాకు చెందిన బిగ్గి సంగీత ప్రపంచంలో ర్యాపర్‌గా, సాంగ్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. గ్రేటెస్ట్ ర్యాపర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1992 -97 కాలంలో తన ర్యాప్‌లతో ఓ ఊపు ఊపాడు. నల్లజాతీయుడైన క్రిస్టఫర్ కళలకు రంగు లేదనీ నిరూపించాడు. అతని గానానికి అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ ర్యాపర్ తన తలమీద ప్లాస్టిక్ కిరీటం ధరిస్తూ ఉండేవాడు. కింగ్ ఆఫ్ న్యూయార్క్‌లో భాగంగా ర్యాప్ పేజెస్ మ్యాగజైన్ కోసం ఫొటోగ్రాఫర్ బరోన్ క్లెబోర్నే 1997లో బిగ్గీని ఫొటో తీశాడు. ఆ ఫొటోలోనూ తాను ఎప్పుడూ ధరించే ఓ ప్లాస్టిక్ కిరీటం అందులో కనిపిస్తుంది. ఇటీవలే ఆ కిరీటాన్ని సొథెబై ఆక్షన్ హౌజ్ వేలం వేసింది.
ఈ ప్లాస్టిక్ కిరీటానికి సోథెబై ఓ పద్నాలుగు లక్షల రూపాయల వరకు వస్తుందని ఊహించింది. కానీ, అంతకుమించి దీన్ని 43 లక్షలు ($594,750) పెట్టి బిగ్గీ అభిమాని సొంతం చేసుకున్నాడు. దీంతో మోస్ట్ ఎక్సెపెన్సివ్ ఫ్యాన్సీ డ్రెస్/ క్యాస్ట్యూమ్ క్రోన్‌గా ప్రపంచ రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది. ఈ కిరీటంపై బిగ్గీ సంతకం కూడా ఉండటం విశేషం. సోథెబై అప్పట్లో ఈ కిరీటాన్ని కేవలం 6 డాలర్లకు కొనుగోలు చేసింది. ఇక బిగ్గీ చనిపోయిన 16 రోజుల తర్వాత తన ‘లైఫ్ ఆఫ్టర్ డెత్’ అనే ఆల్బమ్ విడుదలై బిల్ బోర్డ్ 200 చార్ట్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ర్యాప్ ఆల్బమ్స్‌లో బిగ్గెస్ట్ సేలింగ్ ఆల్బమ్‌గా నిలిచింది. ఒక్క అమెరికాలోనే 10 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి.