- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై పోరులో నిట్ శాస్త్రవేత్తల పరిశోధనలు భేష్
దిశ, వరంగల్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై వరంగల్ నిట్ శాస్త్రవేత్తలు సాగిస్తున్న పరిశోధనలు అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం వరంగల్ నిట్‌ను సందర్శించి డైరెక్టర్ ఎన్ వీ రమణా రావు, పలువురు ప్రొఫెసర్లతో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉష్ణోగ్రత ప్రభావాన్ని నియంత్రించేందుకు, పరమాణు ఆర్ద్రతను లెక్కించడం వంటి పరిశోధనల బాధ్యతలను శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్నారన్నారు. ప్రపంచస్థాయి అత్యున్నత శ్రేణి గల 10 యూనివర్సిటీల్లో వరంగల్ నిట్ శాస్త్రవేత్తలకు చోటు లభించడం తెలంగాణకు గర్వకారణమని కొనియాడారు. ప్రపంచ స్థాయి సంస్థలైన ఎంఐటీ, పిట్స్ బర్గ్, ఇల్లినాయీస్ యూనివర్సిటీలు, నాసా, ఐబీఎం, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో కలిసి నిట్ శాస్త్రవేత్తలు పరిశోధనల్లో పాలు పంచుకోబోతున్నారని మాజీ ఎంపీ తెలిపారు.
Tags: corona, planning commission vice chairman vinod, NIT , scientists efforts, for medicine, praised