లియాండర్ పేస్‌తో హీరోయిన్ డేటింగ్.. గోవాలో అలా దొరికిపోయారు!

by Jakkula Samataha |   ( Updated:2021-07-14 02:45:21.0  )
leander-pace
X

దిశ, సినిమా : ‘ఖడ్గం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ కిమ్ శర్మ.. లియాండర్ పేస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ముంబైలో ఇద్దరూ కలిసి కెమెరాకు చిక్కినా.. తమ రిలేషన్‌షిప్‌పై ఎలాంటి కన్‌ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే లాక్ డౌన్ ఎత్తేశాక గోవాలో ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన ఈ రూమర్డ్ లవ్ బర్డ్స్ గురించి.. తాము స్టే చేసిన హోటల్‌ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ నుంచి సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్చర్స్ నెట్టింట వైరల్ అయిపోయాయి. ఒక పిక్‌లో ఇద్దరూ కలిసి మీల్స్ ఎంజాయ్ చేస్తుండగా.. మరో ఫొటోలో కిమ్ శర్మను లియాండర్ పేస్ వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు.

అయితే, గోవా వెకేషన్‌కు సంబంధించిన పిక్చర్స్‌ను ఈ ఇద్దరు కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ కిమ్ శర్మ మాత్రం సింగిల్ పిక్చర్ సెండ్ చేసి.. ‘మిస్టర్ పి’ కి ఈ క్రెడిట్ దక్కుతుందనే క్యాప్షన్ యాడ్ చేసింది. కాగా ఈ పిక్చర్‌లో ఉన్న కిమ్ డ్రెస్.. హోటల్‌ షేర్ చేసిన పిక్స్‌లో ఉన్న డ్రెస్‌తో మ్యాచ్ కావడం విశేషం. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్ కన్‌ఫర్మ్ అయిపోయింది.

Advertisement

Next Story