హైదరాబాద్‌లో ఈవెంట్‌కు పాప్ సింగర్ రిహానా..

by Shyam |
Rihanna
X

దిశ, సినిమా : మోస్ట్ అవెయిటెడ్ ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా 2021’కు హైదరాబాద్ ఫిలాంత్రఫిస్ట్ సుధారెడ్డి హాజరయ్యారు. బిలియనీర్ మేఘా కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్న ఆమె.. రెడ్డీస్ ఫౌండేషన్ బ్లాక్ టై ఫండ్‌రేజర్ ఈవెంట్‌కు పాప్ సింగర్ రిహాన్నాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మెట్‌గాలా ఈవెంట్‌ తర్వాత తన ఇంటర్నేషనల్ ఏజెంట్ ద్వారా మీట్ అయిన సుధా రెడ్డి.. హైదరాబాద్‌లో జరిగే ఫండ్‌రేజింగ్ కార్యక్రమానికి తనను ఆహ్వానించినట్లు సమాచారం.

ఈ కొలాబొరేషన్‌ పట్ల రిహానా ఇంట్రెస్ట్ చూపిస్తుండగా.. తద్వారా వచ్చే ఫండ్‌ను క్యాన్సర్ హాస్పిటల్స్‌ డెవలప్‌మెంట్‌కు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా డిజైనర్ డుయో ఫాల్గుణి షేన్ పికాక్ రూపొందించిన కాస్ట్యూమ్స్, ఫరాఖాన్ రూపొందించిన జ్యువెల్లరీ ధరించిన సుధారెడ్డి మెట్ గాలా 2021కు హాజరయ్యారు. ఇక ఇంతకు ముందు కూడా ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే, ఇషా అంబానీ, నటాషా పూనావాలా లాంటి సెలబ్రిటీలు మెట్ గాలా ఈవెంట్‌కు అటెండ్ అయ్యారు.

Advertisement

Next Story