ఇంకా ఫైర్ తగ్గని ఐశ్వర్య.. ప్యారిస్ ర్యాంప్ వాక్‌లో హొయలు

by Shyam |   ( Updated:2023-06-20 11:43:19.0  )
ఇంకా ఫైర్ తగ్గని ఐశ్వర్య.. ప్యారిస్ ర్యాంప్ వాక్‌లో హొయలు
X

దిశ, సినిమా : ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2021లో సందడి చేసింది. ఈ వీకెండ్‌కు భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యతో కలిసి ప్యారిస్ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఐశ్వర్య.. ఐకానిక్ ఈఫిల్ టవర్ ముందు వైట్ అవుట్‌ఫిట్స్‌లో చేసిన ర్యాంప్ వాక్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 47 ఏళ్ల వయసులోనూ వన్నెతగ్గని అందం, తనకే సొంతమైన మేని సోయగంతో అందరి దృష్టిని ఆకర్షించింది. వైట్ డ్రేప్ గౌన్ ధరించిన మాజీ మిస్ వరల్డ్.. గులాబీ వర్ణపు అదరాలతో పాటు కురుల అందం ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2021ను హీటెక్కించింది. తను నడిచి వస్తుంటే అచ్చం దేవకన్య దిగివచ్చినట్లే ఉందని అభిమానులు ఆశ్చర్యపోతుండగా.. ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ఇక పాండమిక్ పరిస్థితుల వల్ల రెండేళ్లుగా ఇండియాకే పరిమితమైన ఈ నీలికళ్ల సుందరి.. తాజాగా ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం ర్యాంప్ వా‌క్‌లో పాల్గొంది. ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే.. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడిక్ డ్రామా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.


Advertisement

Next Story

Most Viewed