- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ‘సెంచరీ’ కొట్టిన పెట్రోల్ ధర..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెట్రోల్ లీటర్ ధర వంద దాటింది. పెట్రోల్ ధర 28 పైసలు పెరుగడంతో శుక్రవారం లీటర్ పెట్రోల్ రూ.100.20కు చేరింది. డీజిల్ ధర లీటర్‌కు 35పైసలు పెరగడంతో రూ.94.97తో వందకు చేరువలో ఉంది. గత మే 4 తరువాత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రాకెట్ వేగంతో దుసుకుపోతున్నాయి. మే 4న పెట్రోల్ లీటర్ ధర రూ.95.80 పైసలు ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.89.79పైసలుగా ఉంది.
శుక్రవారం మధ్యాహ్నం పెరిగిన ధరలతో నెలరోజుల్లో రూ.4 .04పైసలు పెరిగింది. డీజిల్ పై రూ.5.18 పైసలు పెరిగింది. చర్లపల్లి నుంచి నిజామాబాద్‌కు పెట్రోలియం, డీజిల్ సరఫరా అవుతుంది. అందుకే హైదరాబాద్‌తో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో ధర ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో బీపీ సీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ సంబంధించి నిజామాబాద్‌లో 160, కామారెడ్డిలో 75 బంక్‌లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిత్యం 2.40 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు, 4.80 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నట్లు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట నర్సాగౌడ్ తెలిపారు.
ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఇంధన ధరలు 16 సార్లు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు ఉపాధి లేక అలమటిస్టున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు అగ్గి పిరమయ్యాయి. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంతదో మరోసారి ఆహార పదార్థాలు, నిత్యవసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ.4, డీజిల్ ధర రూ.5 పెరుగడంతో రవాణా చార్జీలు సైతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ముథోల్‌లో 100.65..
పెట్రోల్ ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. తాజా పెంపుతో పెట్రోల్ ధర శుక్రవారం రూ.100.65, డీజిల్ ధర రూ.95.24కు చేరింది. ఒక వైపు లాక్ డౌన్, మరో వైపు పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలు సామాన్యులను ఇబ్బంది పెడతున్నాయి.