బండి అటకెక్కాల్సిందేనా?.. వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు

by Harish |   ( Updated:2021-10-11 05:20:52.0  )
బండి అటకెక్కాల్సిందేనా?.. వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోజూవారిగా పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గత వారం రోజులుగా పెట్రో ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. దీంతో పెట్రో ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రో ధరలు తగ్గుతాయంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఉపశమనం ఉంటుందని భావించినా.. ధరలు పెరగడం మాత్రం ఆగడం లేదు. దీంతో ప్రజలు వాహనాన్ని తీసేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే, పెరుగుతున్న పెట్రో ధరలు నిత్యావసరాలపై ప్రభావం చూపుతున్నాయి.

ఇటు పెట్రో ధరలు పెరగడం నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా పెట్రో ధరలు పెరుగుతూ.. గతేడాది అక్టోబర్‌లో రూ.85.25 ఉన్న పెట్రోల్ ధర కేవలం ఏడాది సమయంలోనే రూ.108.6కు చేరింది. అంటే ఏకంగా దాదాపు రూ.23 పెరిగింది. దీనితో పాటు గతేడాది డీజిల్ ధర రూ. 76.84గా ఉండగా.. ఇప్పుడు డీజిల్ 101.62కి చేరింది. అంటే డీజిల్ పైన కూడా దాదాపు రూ.25 పెరిగింది. ఇలా పెరుగుతూ పోతున్న పెట్రోల్ ధరలపై నెటిజన్లు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక బండిని అటకెక్కించాల్సిందేనంటూ ట్వీట్లు చేస్తున్నారు. పెట్రో ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed