- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 8న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరపాలని హైకోర్టులో 5 అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసిన అభ్యర్థులమని వీలైనంత త్వరగా కౌంటింగ్ జరపాలని పిటిషన్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ కేసు విచారణలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్లు కోరారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. ఇకపోతే ఏపీలో ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 10న ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.
అయితే పరిషత్ ఎన్నికలను సవాల్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఫాలో కాకుండా ఎన్నికలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొంది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పరిషత్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించామని తెలిపింది. దీంతో వాదనలు విన్న హైకోర్టు విచారణను జూలై 27కు వాయిదా వేసింది.