చలి తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నాడు!

by Anukaran |
చలి తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నాడు!
X

దిశ, వెబ్‌డెస్క్ : పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి రోడ్డు మీదకు రావడంతో ప్రజలందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తమకు ఎక్కడ వైరస్ అంటిస్తాడో అని కేకలు పెడుతూ తలోదిక్కున పరుగులు తీశారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని పాడేరులో శనివారం వెలుగులోకి వచ్చింది.

తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ షాక్‌కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించివేశారు.

Next Story

Most Viewed