- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కోడెల’ చుట్టూ రాజకీయం.. పల్నాడులో హాట్ టాపిక్‌గా విగ్రహ వివాదం
దిశ, పల్నాడు: రాష్ట్ర రాజకీయాల్లో గుర్తుండిపోయే పేరు కోడెల శివప్రసాద రావు. గత నెలలో ఆయన విగ్రహ తొలగింపు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన సమయంలోనే కోడెల శివప్రసాదరావు నరసరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు విశేష కృషి చేశారు. దీంతో కోడెల వర్ధంతి పురస్కరించుకొని ఆయన అభిమానులు ఆస్పత్రిలో రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు గాని, ఇతర ముఖ్య నేతలకు గాని తెలియపరచలేదు.
నెల రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని తీసి పక్కన పెట్టారు. దీంతో విగ్రహం ప్రారంభంకాకముందే వివాదం చెలరేగింది. దీనిపై కోడెల అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చుతుండటంతో ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా స్పందించారు. విగ్రహాన్ని తొలగించాలని ఎవరికీ చెప్పలేదని వివరణ ఇచ్చుకున్నారు. కాగా, నరసరావుపేట టీడీపీలో కోడెల అభిమానులు ఒక వర్గంగా, ఎమ్మెల్యే అభిమానులు మరో వర్గంగా చీలిపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.