AP Mega DSC-2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా..! ప్రధాన కారణం అదే

by Shiva |   ( Updated:2024-11-06 06:17:43.0  )
AP Mega DSC-2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా..! ప్రధాన కారణం అదే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిరుద్యోగులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ (Mega DSC Notifination-2024) విడుదల మరింత జాప్యం కానుంది. నిజానికి నవంబర్ 6న షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనవార్య కారణాల వల్ల నోటిఫికేషన్ విడుదల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. కాగా, సోమవారం ఆన్‌లైన్‌‌లో టెట్‌‌ ఫలితాలను (TET Results) విడుదల చేశారు. మరో రెండు రోజుల వ్యవధిలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ కూడా విడుదల అవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

కానీ, అనూహ్యంగా నోటిఫికేషన్ విడుదలను నలిపివేశారు. ఎస్సీ వర్గీకరణ (Classification of SC) అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదంటూ ఎమ్మార్పీఎస్ (MRPS) తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్లలతో ఎస్సీకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆక్షేపించింది. ఈ క్రమంలోనే మంగళవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో మంద కృష్ణ మాదిగ (Manda Krishn Madiga) భేటీ అయ్యారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కీల విషయాలను ఆయన సీఎంతో చర్చించారు. డీఎస్సీ (DSC) నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల (SC Reservations) అమలు అంశం తేలకపోవడంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC Notification) మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యా శాఖ వెల్లడించింది.

కాగా, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (Mega DSC Notification)లో భాగంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 పోస్టులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed