ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు

by karthikeya |
ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. ప్రైవేటు ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే కొన్ని కేసుల్లో మినహాయింపు ఉంటుందని తెలిపిం ది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7:2 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ‘‘ఏ ప్రైవేటు ఆస్తి కూడా సమాజ వనరు కాదు. ఇ లాంటి అంశాలపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీ య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది. 1950వ దశకం నాటి భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పట్లో జాతీయీకరణ జరిగింది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. దేశంలో భారీగా ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. అందుకే న్యాయస్థానం వ్యాఖ్యానం ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

1978లో జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పు..

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బీ) పేరు చెప్పి ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కుదరదు. కర్ణాటక రాష్ట్రం వర్సెస్ రంగనాథ రెడ్డి కేసులో 1978లో జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు సరికాదు. ఆర్టికల్ 39(బీ) ప్రకారం సామాజిక అవసరాల కోసం అన్ని ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చంటూ ఆనాడు ఇచ్చిన జడ్జిమెం ట్‌తో మేం ఏకీభవించలేం’’ అని ధర్మాసనంలోని ఏడుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే బెంచ్ నిర్ణయంతో జస్టిస్ బి.వి.నాగరత్న పాక్షికంగా విభేదించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా పూర్తిగా విభేదించారు.

16 పిటిషన్ల విచారణ..

ప్రైవేటు ఆస్తుల స్వాధీనాన్ని సవాల్ చేస్తూ దాఖ లైన 16 పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఇందులో ఒక పిటిషన్ 1992లో దాఖలైంది. దాన్ని ముంబైకి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ అప్పట్లో దాఖలు చేసింది. ‘‘సెస్‌ను చెల్లిస్తున్న ఏదైనా అపార్ట్‌మెంటులో ఫ్లాట్లను కలిగిన 70 శాతం మంది దాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు నిర్ణయించుకుంటే.. మిగతా వారి అంగీకారం అక్కర లేకుండానే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు’’ అని మహారాష్ట్ర హౌసింగ్ చట్టంలోని 8-ఏ ఛాప్టర్‌లో పొందుపరిచిన నిబంధనను వ్యతిరేకిస్తూ ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

స్వాధీనం చేసుకుంటే.. ఇవన్నీ చేయాలి

కోల్ కతాలో పార్కు నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ వ్యక్తి ఆస్తిని స్వాధీ నం చేసుకున్న కేసు లోనూ సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్‌ సదరు వ్యక్తికి నష్టపరిహారం చెల్లించినా.. సరైన పద్ధతులు పాటించలేదని పేర్కొంది. ని ర్బంధ స్వాధీనాలు, హడావుడి నిర్ణయాలు, న్యా యబద్ధంగాలేని పరిహారాల కారణంగా పౌరు లు నష్టపోవడానికి చట్టం అనుమతించదని తే ల్చి చెప్పింది. ఆస్తి స్వాధీనం విషయాన్ని ముం దుగా తెలియజేయడం, తగినంత సమయం ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని పరిష్కరించడం, పునరావాసం కల్పించడం, ప్రజాప్రయోజనం కోసమే స్వాధీన ప్రక్రియ అని వివరించడం వంటివన్నీ ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్ నిర్దేశించింది.

Advertisement

Next Story