కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

by Shyam |

దిశ, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యావాపూర్ గ్రామానికి చెందిన నీల నారాయణ(49) మద్యానికి బానిసై కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. కాగా ఆదివారం కూడా ఇదే విధంగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే నారాయణ గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వం ఆస్పత్రకి తరలించారు. మృతుడి భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Person, family strife, suicide, medak

Advertisement

Next Story