పాము కాటుతో వ్యక్తి మృతి

by Shyam |

దిశ, మెదక్: పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గార్లపల్లి రాంరెడ్డి (60) అనే వ్యక్తి గడ్డి కోసేందుకు పొలానికి వెళ్తుంటే నాగుపాము కాటేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. రాంరెడ్డి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Tags: Medak,ones death,snake bite

Advertisement

Next Story