ఉపాధి హామీ పనులు చేస్తూ వ్యక్తి మృతి

by Shyam |
ఉపాధి హామీ పనులు చేస్తూ వ్యక్తి మృతి
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. ఉపాధి హమీ పనులకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన బేగరి సాయిలు మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో అతను గుండె పోటుకు గురై మృతిచెందాడు. విషయం తెలిసి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story