చేపల వేటకని వెళితే.. చెరువు మింగేసింది

by Sumithra |   ( Updated:2021-11-11 06:30:21.0  )
చేపల వేటకని వెళితే.. చెరువు మింగేసింది
X

దిశ, రామాయంపేట : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పన గుల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని చౌకత్ పల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తిప్పన గుల్ల గ్రామపంచాయతీ పరిధిలోని చౌకత్ పల్లి వడ్డెర కాలనీకి చెందిన ఎర్ల కిష్టయ్య(62) గ్రామంలోని హైదర్ చెరువులో రాత్రి పూట చేపలు పట్టడానికి వెళ్లాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ట్రైనీ ఎస్సై లింగరాజు తెలిపారు.

Advertisement

Next Story