బిగ్ బ్రేకింగ్.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్

by srinivas |   ( Updated:2021-10-13 08:46:44.0  )
బిగ్ బ్రేకింగ్.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్
X

దిశ, ఏపీ బ్యూరో: సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం నుంచి 100శాతం ఆక్యుపెన్సీ విధానం అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపోతో కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో థియేటర్లు మూతపడ్డాయి. అయితే కేంద్ర సూచించిన గైడ్‌లైన్స్ ప్రకారం థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే కేవలం 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తెరిచారు. తెలంగాణలో 100శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉండటంతో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించడంతో 100శాతం ఆక్యుపెన్సీకి ఆమోదం లభించినట్లైంది. ఈ నిర్ణయం దసరాకు విడుదల కాబోతున్న సినిమాలకు ఇది తీపికబురని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story