- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలు.. రూ. 500కోట్ల కుంభకోణం’
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నాడని ఆయనపై సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిన అవసరముందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి రూ.500 కోట్ల కుంభకోణం చేసినట్లు తెలుస్తుందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటపడుతాయన్నారు. ఆయన వ్యవహార శైలి చాలా ఏళ్లుగా సరిగా లేదని, ఓ ప్రభుత్వ సేవకుడిగా వుండి కూడా సమాజంలో విభజన వాదాన్ని రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. హిందువుల విశ్వాసలను దెబ్బతీసేలా ప్రవీణ్ కుమార్ ప్రవర్తన ఉందని, మత సామరస్యాన్ని దెబ్బతీసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని ఆరోపించారు. స్వేరోస్ సంస్థ ద్వారా తన మిత్రులకు కేటాయించిన కాంట్రాక్టులు, బినామి ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్నారు.