- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బొగ్గు లారీలతో భయం.. భయం.. అధికారులు పట్టించుకోరా..?
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం-చిక్కడుగుంట సరిహద్దులో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయం మనకందరికీ తెలిసిందే. పవర్ ప్లాంట్‌కు నిత్యం బొగ్గు రవాణా సరఫరా చేయడం ద్వారా లారీలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. మణుగూరు టూ ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై బొగ్గు లారీలు ఓవర్ లోడులతో నిత్యం తిరుగుతున్నాయి. కనీసం బొగ్గులారీలపై సరైన పట్టాలు కట్టకపోవడంతో గాలికి బొగ్గు మొత్తం వాహనదారులపై పడుతుందని ప్రజలు చెబుతున్నారు. దీంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.
బొగ్గు డస్ట్‌తో ప్రజలకు హానికరం
బొగ్గు లారీలు నిత్యం తిరగడం వల్ల బొగ్గు డస్ట్ విపరీతంగా వస్తుందని, దానివల్ల విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి గుండె జబ్బులు వచ్చి, ప్రధాన ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారని వాపోతున్నారు.
హై స్పీడ్ ఫుల్.. లైసెన్స్ నిల్..
భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు వచ్చే బొగ్గు లారీలు విపరీతమైన హై స్పీడ్‌తో తోలుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పగలు-రాత్రులు తేడా లేకుండా విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటున్నారు. బొగ్గు లారీలు తోలే ఏ ఒక్కరికి లైసెన్స్ లేదని, మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రధాన రహదారిపై ఎంతో మందికి యాక్సిడెంట్లు జరిగి, విలువైన ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేస్తున్నారు. ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిద్రమత్తులో రవాణా శాఖ అధికారులు..
భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా చేసే లారీల డ్రైవర్లకు ఒక్కరికి కూడా లైసెన్స్ లేదని.. మద్యానికి అలవాటుపడి వాహనాలు తోలుతుంటే రవాణాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రవాణా శాఖ అధికారులు మామూళ్లకు అలవాటు పడి లారీలపై చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటే ఎన్నో లారీలు సీజ్ అవుతాయని.. ఇప్పటికైనా బొగ్గు లారీలపై చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.