ఈటల క్రేజ్‌ చూసి ఖంగుతిన్న కేటీఆర్ (వీడియో)

by Anukaran |   ( Updated:2023-05-19 08:12:41.0  )
Etela Rajender, Minister KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంత్రి కేటీఆర్ ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అయితే, కేటీఆర్ కంటే ముందే శుభకార్యానికి వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రజలు, అభిమానులు ఎగపడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కేటీఆర్‌ను చూసి కూడా ప్రజలు ఈటలను వదలకుండా చుట్టుముట్టారు. అది చూసిన కేటీఆర్ చేసేదేమీ లేక ఒకపక్క నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గతంలో కేటీఆర్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రజలు ఎగబడేవారని, కానీ, ఇప్పుడు ఆయన క్రేజ్ తగ్గిపోయిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story