చిన్న పనులకే రోడ్డెక్కుతున్న జనం !

by vinod kumar |   ( Updated:2020-04-07 05:35:15.0  )
చిన్న పనులకే రోడ్డెక్కుతున్న జనం !
X

దిశ, మేడ్చల్: కరోనా వైరస్ సోకితే పరిస్థితి ఎలా ఉంటుందో టీవీలు, సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి నుంచి ఎవరికి వైరస్ సోకుతుందో కూడా తెలియని పరిస్థితి. కానీ నగరవాసులు తమకేం పట్టదన్నట్టుగా వ్యవహరిస్తూ కొన్నిచోట్ల నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. చిన్న, చిన్న పనులకే రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు వస్తుండగా, నమోదైన కేసుల్లో సైతం వీరిదే సింహభాగం. కానీ ఇవన్నీ ఏం తెలియదన్నట్లుగా రోడ్డెక్కుతున్నారు జనాలు.

కేంద్ర, రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలో జనాలు సంయమనం పాంటించి ఇంట్లోనే ఉన్నారు. కానీ ప్రస్తుతం రోడ్డుపైకి రావడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఉప్పు, పప్పులకు కూడా కిలోమీటర్ల దూరం వాహనాలపై ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా నిత్యావసరాలకు అని చెప్పి తిరుగుతున్నారు. అందుబాటులో ఉన్న సరుకులతో సరిపెట్టుకోకుండా బ్రాండెడ్ సరుకుల కోసం దూరం వెళ్లడానికే ప్రిపరెన్స్ ఇస్తున్నారు. దీంతో కాలనీల్లో ఒకరిని చూసి మరొకరు రోడ్లపైకి వస్తున్నారు.

మేడ్చల్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 17కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దర్ని డిశ్చార్చి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న జిల్లా ప్రజలకు మరో టెన్షన్ వెంటాడుతుంది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు రెండువారాల పాటు ప్రజల మధ్యే తిరిగారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో అధికారులతో సర్వే చేయిస్తోంది.

క్వారంటైన్‌కు 156 మంది

మేడ్చల్ జిల్లాలో 60 మంది వరకు మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వీరంతా తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి తిరిగారు. నిజానికి మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి ఫస్ట్ కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యేంత వరకు విషయం తెలియదు. ఎంతసేపటికి విదేశాల నుంచి వచ్చినవారిపైనే ఫోకస్ పెట్టారు తప్ప వీరిపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం ప్ర్రార్థనలకు వెళ్లొచ్చిన 60 మందితో పాటు, వీరు కలిసిన మరో 96 మందిని సైతం క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో ఎంతమందికి పాజిటివ్ వస్తుందనేది తెలియదు.

పోలీసులతో వాగ్వాదం

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు, అధికారులు మొత్తుకుంటున్నారు. పోలీసులు చెక్ పోస్టులు పెట్టి, రోడ్లపై గస్తీ నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతున్నా.. కొందరు వినట్లేదు. పైగా పోలీసులతోనే కొంతమంది యువకులు వాగ్వాదానికి దిగుతున్నారు.

Tags: Corona Virus, Lockdown, Police Check Post, Supermarkets, Vehicles, Markaz Prayers, Medchal District 156 Quarantine

Advertisement

Next Story

Most Viewed