- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘విదేశీ’ మోసం.. యువతకు గాలం
దిశ, జవహర్ నగర్: విదేశీ కొలువుల పేరుతో సైబర్ నేరగాళ్లు గ్రేటర్ యువతకు వలవేస్తున్నారు. ప్రధానంగా సింగపూర్, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని బహుళజాతి కంపెనీల్లో ఐటీ సంబంధిత ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలంటూ నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. తొలుత టెలిఫోన్ ఇంటర్వ్యూలు ఆ తరువాత ఫేక్ ఆఫర్ లెటర్లు, వీసాలు జారీ చేసి లక్షల్లో దండుకుంటున్నారు.
తాజాగా షైన్‌డాట్ కాం ను నమ్మి ఇటీవల దమ్మాయి గూడకు చెందిన బత్తుల శ్రీనివాస్ రెడ్డి రూ. 69 వేలు, యాప్రాల్ కు చెందిన సంపత్ రెడ్డి రూ. లక్షా ఐదు వేలు సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కి నష్టపోయినట్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యక్ష పర్యవేక్షణలో విదేశీ ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠాపై దృష్టి సారించి, ఘజియాబాద్‌లోని మోరాద్‌నగర్‌కు చెందిన విజయ త్యాగి(35), ఢిల్లీకి చెందిన పూర్ణిమ గంగూలీ (40), భువన్ చంద్ర భట్ (32), నోయిడాకు చెందిన అమిత్ చౌహాన్ (26) లను రాచకొండ పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి 5 మొబైల్ ఫోన్లు, 17 లాప్ టాప్‌లు, 3 వైఫై రూటర్లు, డీవీఆర్‌లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ జాబ్ పోర్టల్ నుంచి వచ్చే ప్రకటనలను నమ్మి యువత మోస పోవద్దని, ఎలాంటి కమ్యూనికేషన్, లావాదేవీలను జరపవద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ యువతను కోరారు.