- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కారణంగా ఆ ఊరికి కొత్త కష్టాలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా పేరు చెబితేనే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. ఎక్కడ చూసినా, విన్నా దాని గురించే చర్చ. అయితే గతంలో కరోనా కారణంగా కరోనా బీరు అమ్మకాలు తగ్గినట్లే ఇప్పుడు కొత్తగా కరోనాకు దాదాపు దగ్గరగా ఉండే పేరు ఉండటంతో ఓ ఊరు బహిష్కరణకు గురవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఒక ఊరి పేరు కోరౌనా.. దీని వాడకంలో కరోనా కరోనా అంటూ పిలిచేవారు. ఇదే ఇప్పుడు ఆ ఊరి వారికి శాపంగా మారింది. వారి ఊరి పేరు కారణంగా చాలా వివక్షతను ఎదుర్కొంటున్నామని కోరౌనా గ్రామ ప్రజలు వాపోతున్నారు. కనీసం వారి ఊరికి రావడానికి కూడా జనాలు భయపడుతున్నారని అంటున్నారు. చివరికి వారి నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కూడా తీసుకోవట్లేదని స్థానికుడు సునీల్ చెబుతున్నాడు. ఇంకా చాలా మంది తమ ఊరి పేరు మీద జోకులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే కూడా ఇబ్బందిగా అనిపిస్తోందని అన్నాడు. ఎప్పుడో పెట్టిన ఊరి పేరుకు తాము ఇప్పుడు ఇబ్బంది పడాల్సివస్తుందని చెప్పాడు.
Tags : Corona, COVID 19, Village, Kurauna, Uttar Pradesh