పెన్ పరిశ్రమకు జీఎస్టీ కష్టాలు!

by Harish |
పెన్ పరిశ్రమకు జీఎస్టీ కష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావం కారణంగా దేశంలోని చాలా విద్యాసంస్థలు మూసేయడంతో పెన్నుల పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన ఈ పరిశ్రమ కరోనా వల్ల డిమాండ్ లేమిని, పన్నుల సమస్యలను ఎదుర్కొంటోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. తమ ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీని విధిస్తున్నారని పెన్ తయారీదారులు పరోక్ష పన్ను బోర్డును సంప్రదించారు. అంతేకాకుండా క్యాప్, రీఫిల్ వంటి విడి భాగాలపై 18 శాతం కూడా పన్ను ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు.

‘దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేయబడి, కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఫ్రమ్ ఇచ్చిన కారణంగానే పెన్ పరిశ్రమ దాదాపు 50 శాతం డిమాండ్‌ను కోల్పోయిందని’ కలకత్తా పెన్ తయారీదారులు, డీలర్ల సంఘం అధ్యక్షుడు నరేష్ జలన్ చెప్పారు. పెన్ పరిశ్రమ తరపున కేంద్ర పరోక్ష పన్నుల బోర్డుకు పన్నుల తగ్గింపు విషయమై అభ్యర్థించినట్టు ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ అధికంగా ఉండటం మూలంగా దేశీయంగా తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తద్వారా పెన్ తయారీదారులు దిగుమతులవైపు చూస్తున్నారని కాన్ఫడరేషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుశీల్ చెప్పారు.

Advertisement

Next Story