- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పొచ్చెర’ జలపాతాన్ని కమ్మేసిన పెద్దవాగు..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పొచ్చెర, కుంటాల, కొరిటికల్, కనకాయి, మిట్టె, వాస్తాపూర్, సమతలగుండం, చింతల మాదరి వంటి జలపాతాలు ఉధృతంగా జాలువారుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని జలపాతాలు మాములుగా సందడి చేయడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జలపాతాలు పొంగి పారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర జలపాతం కనిపించకుండా పెద్దవాగు ప్రవహిస్తోంది. ఇది చాలా అరుదుగా కనిపించే దృశ్యం.
కానీ, ఈ ఏడాది ఆ దృశ్యం కనిపిస్తోంది. దీనిని బట్టి బోథ్ మండలంలో కురుస్తున్న వర్షం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బోథ్‌లో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం అక్షరాల 211మిల్లీ మీటర్లు. భారీ వర్షాల ధాటికి జిల్లాలోని అన్ని జలపాతాల వద్ద పెనుప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో జలపాతాల వద్దకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నారు.