బిగ్ బ్రేకింగ్: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. పోలీస్ కస్టడీలో పుట్ట మధు

by Anukaran |   ( Updated:2021-05-08 06:19:29.0  )
బిగ్ బ్రేకింగ్: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. పోలీస్ కస్టడీలో పుట్ట మధు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వామనరావు దంపతుల హత్య కేసులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మరోసారి తెరపైకి వచ్చిన పుట్టా మధు గతకొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌ భీమవరంలో ఓ హోటల్‌లో ఆయనను రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయనను హైద‌రాబాద్‌కు తీసుకువ‌స్తున్నారు. ఆయనపై ఉన్న కేసులు స‌హా క‌నిపించ‌కుండాపోవ‌డం వెనుక కార‌ణాల‌పై పోలీసుల ఫోక‌స్ పెట్టారు. ఈటల భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే మ‌ధు కనిపించకుండా పోవ‌డం క‌లక‌లం రేపింది. హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడంతో ఈ కేసు విష‌యంలో భ‌యంతోనే పుట్టా మధు క‌నిపించ‌కుండా పోయార‌న్న ప్రచారం కూడా జ‌రుగుతుంది.

Advertisement

Next Story