పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో పదవి ఇక నాకొద్దు: ఖాన్

by Shyam |
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో పదవి ఇక నాకొద్దు: ఖాన్
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈవో పదవికి వాసిమ్ ఖాన్ రాజీనామా చేశారు. అతడి రాజీనామాను బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ పీసీబీ బుధవారం జరిగిన ఒక వర్చువల్ మీటింగ్‌లో ఆమోదించింది. 2019 ఫిబ్రవరిలో పీసీబీ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాసిమ్ ఖాన్‌కు 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఉన్నది. మరో ఐదు నెలల గడువు ఉండగానే వాసిమ్ ఖాన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ‘వాసిమ్ ఖాన్ ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి. అతడి నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. కరోనా సమయంలో పాకిస్థాన్‌లో తిరిగి క్రికెట్‌ను పునరుద్ధరించడానికి చాలా కృషి చేశాడు. శ్రీలంక జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడానికి.. పీఎస్ఎల్ తిరిగి స్వదేశానికి తిరిగి రావడానికి వాసిమ్ ఖాన్ కృషి కారణం’ అని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా వ్యాఖ్యానించారు. అయితే వాసిమ్ ఖాన్ కాంట్రాక్ట్ గడవక ముందే ఎందుకు రాజీనామా చేశాడనే విషయం మాత్రం తెలియలేదు.

Advertisement

Next Story