పోలీసులకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. వీడియో వైరల్

by Anukaran |   ( Updated:2023-05-19 11:40:17.0  )
పోలీసులకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. వీడియో వైరల్
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ శ్రమదానం కార్యక్రమానికి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. కొవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అనుమతులు నిరాకరించారు. అంతేకాదు జనసేన కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. అర్థరాత్రి ఇంటికి వెళ్లి మరీ నోటీసులిచ్చారు. చివరకు పవన్‌ కళ్యాణ్‌ శ్రమదానం కార్యక్రమానికి వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి సభ ప్రాంగణానికి వెళ్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పైకి ఎక్కి మరీ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. తమ జన సేన పార్టీ కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. తమ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ఊరుకోబోనని కారు టాప్ ఎక్కి మరీ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Next Story