జనవరి 1న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే!

by Shyam |
Vakeel Saab
X

దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. లాక్ డౌన్‌ కారణంగా ఎప్పుడో రావాల్సిన వకీల్ సాబ్ సినిమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లాక్‌డౌన్‌కు ముందే 80శాతం పూర్తైన వకీల్ సాబ్, ప్రస్తుతం మిగిలిన భాగం కూడా దాదాపు పూర్తైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వకీల్ సాబ్ సినిమా టీజర్‌ను న్యూ ఇయర్ కానుకగా విడుదల కానుంది. పోయిన దసరాకు టీజర్ విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించినా కరోనా కారణంగా కుదర్లేదు. అయితే ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా ఈ టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు. దీంతో న్యూయర్ రోజు పవన్ ఫ్యాన్స్‌కు రెండు పండుగలు కలిసొచ్చినంత ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సినిమా విడుదలను 2021 ఏప్రిల్‌లో ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Next Story